నందిగామ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను అభినందించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

Spread the love

ఆల్ ఇండియా లెవెల్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ 2nd లెవెల్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నందిగామ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ..

విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం ఏకాగ్రత, పట్టుదలతో చదువుకోవాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా లెవెల్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ 2nd లెవెల్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి.. తదుపరి టెస్టులకు ఎంపికైన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఆయనను యాజమాన్యంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు ..

ముందుగా ఆల్ ఇండియా పోటీలలో సెలెక్ట్ అయిన విద్యార్థులు శశి ప్రియ, వర్ష, రోహిత్ కుమార్, శాంకరి శ్రీ లాస్య లను.. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాసనమండలి సభ్యులు డాక్టర్ అరుణ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సాధించిన గోల్డ్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్ అందుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రత, పట్టుదల.. కార్య దీక్షతో చదువుకుంటే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని సూచించారు. తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా విద్యార్థులు మంచి దృక్పథంతో ముందుకు నడవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సాధించాలనుకున్న లక్ష్యాలను విడిచి నిరాశ, నిస్పృహలకు లోను కాకూడదన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి “ఐఐటీయన్స్” గా దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో.. ఉత్తమ శిక్షణ ఇస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు ..

ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ వినోద్, డిన్ రవికుమార్, సి బ్యాచ్ ఇంచార్జ్ రామాంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ వరుణ్, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page