SAKSHITHA NEWS

ఎమ్మెల్యే చొరవతో సమసిన స్థల వివాదం…

ఆక్రమణలకు గురైన స్థలం కాలనీ వాసులకు అందుబాటులోకి… ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ కాలనీ వాసులు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కేటీఆర్ కాలనీ సర్వే నెంబర్ 270లో ప్రజా అవసరాలకు కేటాయించిన 1.23 గుంటల భూమి ఆక్రమణలకు గురి కావడంతో కాలనీ ప్రజలు ఎమ్మెల్యే ని ఆశ్రయించారు

. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి వహించిన ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్ళి కాలనీ వాసులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా స్థలం కొన్నేళ్లుగా కోర్టు కేసులో ఉండగా.. న్యాయ పోరాటంలో విజయం సాధించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి పరిష్కారం చూపినందుకు కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని స్థానిక కార్పొరేటర్ వాకలపూడి రవికిరణ్ తో పాటు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే సహకారంతోనే సమస్య పరిష్కారం అయ్యిందని కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా అట్టి స్థలంలో మోడల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్మతేజ, వేమూరి నాగరాజ్, సుధీర్ వర్మ, రాఘవ రావు, క్రాంతి, చైతు, ప్రవీణ్, దశరథ్, సతీష్ నాయుడు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS