సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ లో జోనల్ కమిషనర్, అధికారులతో ఎమ్మెల్యే పర్యటన.

Spread the love

MLA visit with Zonal Commissioner and officials in Suraram Division Sriram Nagar.

సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో జోనల్ కమిషనర్, అధికారులతో ఎమ్మెల్యే పర్యటన


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఈరోజు జోనల్ కమిషనర్ మమత మరియు అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ మేరకు భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీ పూర్తిగా ముంపుకు గురై వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సూరారం కొత్త చెరువు నుండి శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా పెద్ద చెరువుకు కలుపుతూ బాక్స్ నాలా నిర్మాణానికి అవసరమయ్యే వ్యయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

వచ్చే వర్షాకాలం వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చెన్నారెడ్డి, ఎస్ఎన్డిపి ఈఈ నారాయణ, ఈఈ గోవర్ధన్, డిఈ నరేందర్, వాటర్ వర్క్ జీఎం శ్రీధర్ రెడ్డి, డిఈఈ శిరీష, ఏఈ రామారావు,

ఏఈ సంపత్ మరియు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు మన్నె బాలేష్, వారాల వినోద్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, ఫెరోజ్, బషీర్, రెహ్మాన్, కాలనీ ప్రెసిడెంట్ సురేష్ బాబు, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page