కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే రివ్యూ సమావేశం

Spread the love
MLA RK Review meeting with Electrical officials and Corporation officials

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఎలక్ట్రికల్ అధికారులతో మరియు కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే రివ్యూ సమావేశం…


సాక్షిత : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆర్కే ఎలక్ట్రికల్ మరియు కార్పొరేషన్ అధికారులతో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పర్యటించిన సచివాలయాలలో ఎలక్ట్రికల్ సమస్యలు (కొత్త కరెంట్ స్తంభాలు, అదనపు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, 3 ఫేస్ లైన్) మరియు నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సమస్యలు పై చర్చించడం జరిగింది.

కొన్ని సమస్యలు పరిష్కారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారే స్వయంగా చేస్తామని, మరికొన్ని సమస్యలు పరిష్కారం కార్పొరేషన్ ద్వారా డిమాండ్ కట్టించుకొని పనులను పూర్తి చేస్తామని ఎలక్ట్రికల్ అధికారులు తెలియజేశారు.

కార్పొరేషన్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్కే సూచనలు చేశారు

Related Posts

You cannot copy content of this page