ప్రగతి యాత్ర‘లో భాగంగా 22వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

Spread the love

ప్రగతి యాత్ర‘లో భాగంగా 22వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్, వాణి నగర్, ఇంద్రసింగ్ నగర్ లలో పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 22వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి వెంకటేశ్వర నగర్, వాణి నగర్, ఇంద్రసింగ్ నగర్ లలో ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ ఆయా కాలనీల్లో దాదాపు పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా వర్షపు నీటి నాలా నిర్మాణానికి చొరవ చూపాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

అదే విధంగా కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో కమిటీ హాల్ నిర్మాణం, కొత్త కరెంటు కేబుల్ ఏర్పాటు వంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అందుకు చర్యలు తీసుకొని పరిష్కరిస్తామని చెప్పారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్,

డివిజన్ బీఆర్ఎస్ సెక్రెటరీ సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, కాలనీ అధ్యక్షులు నాగదీప్ గౌడ్, మధుకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశం, భగవాన్ రెడ్ట్, మనోహర్ కుమార్, చందు, ఇమ్మడి నరసింహ, మహేష్, విజయ్, వెంకటేష్, సుబ్బన్న, శ్రీనివాస్, వెంకటేష్ రావు, కేశవ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, సంపత్, నసీర్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, వీరయ్య, సంతోష్, అప్పారావు, వెంకటేష్ రెడ్డి, మన్నె సత్తయ్య, జ్యోతి రెడ్డి, పట్టాభి, విష్ణు, కృష్ణ, స్వప్న, సత్యవతి, సూర్యనారాయణ, జార్జ్, జగదీష్ గౌడ్, ప్రసాద్, కరీముల్లాహ్, సత్యనారాయణ, రామరావు, సుకుమార్, రాజు, రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ, సురేందర్ రెడ్డి, యాదగిరి, భాస్కర్ రెడ్డి, నవీన్, రామ్ రెడ్డి, జయంచారీ, ప్రభాకర్ రెడ్డి, రమణ మూర్తి, ప్రభాకర్, బాలయ్య, బాలరాజ్, ఉమేష్, సదానందం గౌడ్, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page