కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో “నవభూమి” దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ముఖ్య పాత్ర పోషించడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నవభూమి దినపత్రిక ఇంచార్జ్ ఎల్లా రెడ్డి, గాజులరామారం ప్యాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారులు కస్తూరి బాలరాజ్, సీనియర్ నాయకులు సమ్మయ్య నేత, కుంటి మల్లేష్, అరుణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.