125 – గాజులరామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలల్లో చిత్తారమ్మ దేవి జాతర కూడా ఒకటని, ఈ జాతరలో అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. అంతకముందు చిత్తారమ్మ జాతరపై సమీక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి, బాలానగర్ డిసిపి ఎస్.శ్రీనివాసులు, ఇతర అధికారులు, పాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు విజయ రాంరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, రషీద్ బేగ్,
జగత్గిరి గుట్ట డివిజన్ అద్యక్షులు రుద్ర అశోక్, సూరారం డివిజన్ అద్యక్షులు పుప్పాల భాస్కర్, స్ధానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.