గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోడాలి నాని

Spread the love

అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసి…. రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాని

-రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి….. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని ఆకాంక్షించిన- ఎమ్మెల్యే కొడాలి నాని

ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్

*ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

*ఆయనకు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

*పెద్దలు, అనుభవజ్ఞులు పట్ల గౌరవ మర్యాదలతో ఉంటూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి రామ్ చరణ్.

*కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా
నడుచుకునే విధానమే…..రామ్ చరణ్ కు శ్రీరామరక్షగా నిలుస్తాయి.

*తండ్రికి తగ్గ తనయుడుగా ముందుకు వెళుతున్న రామ్ చరణ్….. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకొని జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అద్దేపల్లి పురుషోత్తం, పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, మాదాసు వెంకటలక్ష్మి, కోంకితల ఆంజనేయ ప్రసాద్, తోట రాజేష్, మొండ్రు వెంకటేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page