ఫాక్స్ సాగర్ చెరువు నుండి కెమికల్ నాలా వరకు నిర్మిస్తున్న పైపులైన్

Spread the love

MLA inspected the pipeline works being constructed from Fox Sagar Pond to Chemical Canal…

ఫాక్స్ సాగర్ చెరువు నుండి కెమికల్ నాలా వరకు నిర్మిస్తున్న పైపులైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ చెరువులో డ్రైనేజీ నీరు చేరకుండా చెరువు నుండి కెమికల్ నాలాకు కలుపుతూ నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ మేరకు పైపు లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, ఇరిగేషన్ ఏఈ రామారావు,

ఎస్ఓ ప్రభావతి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, భాస్కర్ రెడ్డి, ఇస్మాయిల్, మహిళా నాయకురాలు పద్మజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page