జూనియర్ కాలేజి నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

కాలేజీ మంజూరు చేసిన సీఎం కి మంత్రులకు కృతజ్ఞతలు – ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి

నల్లగొండ నార్కట్ పల్లి మండలంలో నూతనంగా మంజూరు చేయించిన జూనియర్ కాలేజి నిర్వహణకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఏఎమ్ఆర్ కాలేజి భవనంలో జూనియర్ కాలేజిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, కట్టంగూర్, నార్కట్ పల్లి మండల విద్యార్థులు లబ్ధి పొందవచ్చని అన్నారు.


ఎంపిసి, బిపిసి, సిఈసి, హెచ్ఈసి కోర్సులతో పాటు రెండు ఒకేషనల్ కోర్సులతో మొదటి సంవత్సరం విద్యాబోధన జరుగుతుందని, వచ్చే ఏడాదిలోపు నుతన భవనాన్ని మంజూరు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత చేరువ చేస్తామని తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
గత రెండు సంవత్సరాల నుండి జూనియర్ కాలేజి మంజురుకు సిఎం కేసీఆర్ ని కోరగా సిఎం కేసీఆర్ పెద్ద మనసుతో జూనియర్ కాలేజి మంజూరు చేశారని అన్నారు. నార్కట్ పల్లి జూనియర్ కాలేజి మంజూరు చేసిన సిఎం కేసీఆర్ కి విద్యాశాఖామాత్యులు సబితా ఇంద్రారెడ్డికి, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డికి ఆయన ధన్యావాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page