3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన
అర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్
*సాక్షిత తిరుపతి : రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ నాలుగేండ్లలో ప్రజా పథకాలు ద్వారా 3 లక్షల 30 వేల కోట్లు ముఖ్యమంత్రి జగనన్న అందజేసారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో జీవకోన, ప్రకాశం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష క్యాంపులలో సర్టిఫికెట్లను అందజేసే కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, తిరుపతి అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, కార్పొరేటర్లు హాజరై సర్టిపికెట్లు అందచేశారు. రెండు క్యాంపులలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతిగా ముద్రపడ్డ జగనన్నకు మనమందరం అండగా నిలబడాలని ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానొస్తే జాబొస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో ఓక్క జాబు కూడా ఇవ్వలేదని, అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా తానొస్తే జాబిస్తానని చెప్పకుండానే, అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే సచివాలయ కార్యదర్శులుగా ఓకటిన్నార లక్షల మందికి ఉధ్యోగాలు ఇచ్చి, ప్రభుత్వ ఉధ్యోగులుగా నియమించడం జరిగిందన్నారు. రెండున్నార లక్షల మందిని సేవా వాలంటీర్లుగా ప్రజల కోసం నియమించుకొని, మీ ఇండ్ల వద్దకే ప్రభుత్వ పధకాలను అందించేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇస్తేనే పేద ప్రజలకు మరింత న్యాయం చేస్తారని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి డివిజన్లలో వేలాది మంది సర్టిఫికేట్స్ పొందుతున్నారని, వారందరికి అర్హత మేరకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రజల అభివృద్దిని సమానంగా చూస్తూ ప్రజా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యధికంగా ప్రజలు అండగా వున్నారని, ప్రతి పక్షాలు చేసే కుట్రకు ప్రజలు లొంగవద్దని మేయర్ డాక్టర్ శిరీష తెలియజేసారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రజలకు ప్రజా పథకాలను అందిస్తూ, ఇంకా ఎవరైన అర్హులు మిగిలిపోయరా అనే ఆలోచనతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్ మోహన్ రెడ్డిని మళ్ళి మీరంతా ఆశీర్వదించాలని మేయర్ డాక్టర్ శిరీష విజ్ఞప్తి చేసారు. కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనగా, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగ అందిస్తున్న 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలు తీసుకుంట్టున్నారని, గత కొన్ని వారాలుగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సర్టీఫికెట్ల కోసం, వారి దగ్గర దరఖాస్తులు తీసుకోవడం, మంజూరు అయిన సర్టీఫికెట్లను జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు సంధ్యా యాదవ్, తిరుత్తణి శైలజా, అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, నాయకులు తిరుత్తణి వేణుగోపాల్, తలారి రాజేంద్ర, బాలిశెట్టి కిశోర్, రఫి హింధూస్థాని, శ్యామల, పునీత, క్యాంప్ కో ఆర్డినేటర్లు పి.రవి, శశి తదితరులు పాల్గొన్నారు.