‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు

Spread the love

ప్రకాశం జిల్లా

జగనన్నే మా భవిష్యత్తు -జగన్నన్నే మా నమ్మకం…

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు
– ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదం.
– రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులతో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుస్తారు.
-కోటి 60 లక్షల కుటుంబాలను కలిసే గొప్ప కార్యక్రమం

గిద్దలూరు నగర పంచాయతి పరిధిలోని 10 వ సచివాలయం పరిధిలోని గృహాలను సందర్శించి మద్దతు కోరిన ఎమ్మెల్యే అన్నా
……………………………….
‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలిసే భారీ కార్యక్రమానికి ఈరోజు నుంచి శ్రీకారం చుట్టనున్నామని ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు అన్నారు. శుక్రవారం గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డులో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యే భారీ సర్వే కార్యక్రమంగా దీన్ని ఈరోజు నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మొదలై ఈనెల 20 వరకు కొనసాగుతోందన్నారు. ప్రతీ ఇంటి గడపకు గౌరవ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైనికులుగా, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు కలిసి ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తారన్నారు. గృహసారథులు ఇంటింటికీ వెళ్తారు. దాదాపు 7 లక్షల మంది గృహసారథులు రాష్ట్రంలోని 1 కోటి 60 లక్షల ఇళ్లను ఈ 14 రోజుల్లో సందర్శిస్తారన్నారు. దాదాపు ఐదుకోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ‘మమ్మల్ని మా జగనన్న పంపారు. మీతో మాట్లాడి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై, ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం..’ అని ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ విధంగా అన్ని కులాలు, మతాలకు చెందిన వారితోపాటు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబాలు కూడా ఉంటాయన్నారు. అధికారంలో ఉన్న ఒక పార్టీ తరఫున అన్ని ఇళ్లకు నేరుగా మా సైనికులు వెళ్తారన్నారు. ఒక ఇంటికి వెళ్లినప్పుడు ‘మీకు మా ప్రభుత్వం ద్వారా ఏమేమి అందాయి..? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ఏం గమనించారు..? ’ అని అడిగే సాహసోపేతమైన మెసేజ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి గారి ఇంటింటికీ వినిపించి, ప్రజల నుంచి వచ్చే మెసేజ్‌ను స్వీకరించి.. వారి మద్ధతుకోరి.. వారి మద్ధతు తీసుకుని మరో ఇంటికి వెళ్తామన్నారు. ఇంతటి సాహసోపేతమైన భారీ కార్యక్రమాన్ని ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వమే చేయగలుగుతుందంటే స్వాతంత్య్రానంతరం పూర్తి పారదర్శకంగా, మనం ఏదైతే మాట్లాడతామో.. దాన్నే ఆచరించాలనే సిద్ధాంతంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని గర్వంగా చెబుతున్నామన్నారు. అర్హత ప్రమాణాల్లో పేదలను ఎక్కువగా చేరుస్తూ వారి సాధికారత దిశగా సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో గత TDP ప్రభుత్వానికి.. ప్రస్తుత YSRCP పాలనను పోల్చి చెప్పే కరపత్రాలు అందిస్తామన్నారు. ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని నమోదు చేస్తామన్నారు. మద్దతు తెలిపిన వారికి డోర్ మరియు మొబైల్ స్టిక్కర్లు ఇవ్వబడుతాయన్నారు. అనంతరం 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇటీవల సభల్లో చెబుతున్నట్లుగా ‘నాలుగేళ్లుగా, వచ్చే ఏడాదిలోనూ మా ప్రభుత్వం ద్వారా ప్రయోజనం నేరుగా మీ ఇంటి సభ్యులకు అందిందంటేనే.. మన ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వసిస్తే.. మరోమారు ఆశీర్వదించండని ధైర్యంగా, దమ్ముగా అనగలిగారంటే అందుకు కారణాలున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అందుకు అతీతంగా మన రాష్ట్ర ప్రభుత్వం పంటిబిగువున పేదవాడి సంక్షేమం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తోందన్నారు. ఏదైతే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం అందిస్తుందో.. దాన్నే సంక్షేమ క్యాలెండర్‌గా ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఇన్నాళ్లూ అన్నిరకాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావడంలో, మరీ ముఖ్యంగా మహిళల్ని అన్నిరంగాల్లో ముందుంచే కార్యక్రమాలు చేపట్టంలో మా పార్టీ నిర్మాణాత్మకంగా, బాధ్యతగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడి అవసరాలు గుర్తించి, వాటిని నూటికి నూరుశాతం తీర్చడమే కాకుండా వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..వారికి వారుగా, తమంతటతాముగా నిర్ణయం తీసుకునే స్థాయికి వారి బతుకులు మార్చిన ప్రభుత్వమిదిన్నారు. ఈ నినాదం, ఈ కార్యక్రమం అనేది ప్రజల నుంచి వచ్చిందే గానీ.. తెలుగుదేశం పార్టీ తరహాలో.. వాళ్ళలా ఊహాలోకంలో విహరించి భ్రమల్లో బతకాలనే నైజం మా పార్టీది కాదన్నారు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతీ గడపగడపకు తిరిగి.. ప్రతీ ఇంటి తలుపు తట్టి ఒక కరపత్రం అందిస్తారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల పరిస్థితులు, సాధికారతతో పాటు మరీ ముఖ్యంగా, ఈ మూడున్నరేళ్ళలో రూ. 2లక్షల కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలను డీబీటీ ద్వారా నేరుగా అర్హులైన పేదల ఖాతాల్లోకి జమచేసిన ఘనత జగనన్నదే అన్నారు. అనంతరం జగన్నన్నే మా భవిష్యత్తు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సచివాలయ కన్వీనర్లు, గృహ సారధు లతో కలిసి ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు గిద్దలూరు నగర పంచాయతీ 10 సచివాలయం పరిధిలోని గృహలను సందర్శించి వారి మద్దతు తెలుసుకొని ఇంటి ఇంటికి స్టిక్కర్లు వేసి ప్రజా అభిప్రాయం తెలుసుకున్నారు. వారి నుంచి కూడా జగనన్నే ప్రభుత్వం లోనే మాకు అన్ని పథకాలు వచ్చాయని ప్రజల నుండి స్పందన రావడంతో వారికి ఎమ్మెల్యే అన్నా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బంగారు శీనయ్య,ప్రజా ప్రతినిధులు,ముఖ్యమైన నాయకులు,ఎంపీపీలు,జడ్పీటీసీ సభ్యులు,ఎంపీటీసీ సభ్యులు,సర్పంచ్ లు,వివిధ హోదాలో ఉన్న వైసీపీ నాయకులు,గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్,వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు,కో -ఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు,వైసీపీ అనుబంధ విభాగాల కార్పొరేషన్ డైరెక్టర్ సభ్యులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సచివాలయ కన్వీనర్ లు,గృహ సారధులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page