ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి 01 మార్చ్ సాక్షిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసిన ఒక మహిళ ఆనందం కి ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ కళ నేరవేరింది వేళ తాము ఉంటున్న ఇంటి స్థలాన్ని తమ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్యపు హక్కు కల్పించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు రుణపడి ఉంటాము.ఇదీ బుధవారం ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న అనేకమంది పేదలు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని అనేక సంవత్సరాల నుండి కోరుతూ వస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి లబ్దిదారులు పలు పర్యాయాలు తమ సమస్యను తీసుకురావడం, మంత్రి కూడా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్ట ప్రాంతానికి చెందిన రమేష్ కుటంబం 50 సంవత్సరాల నుండి F లైన్ లో నివసిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు తో నిర్దేశించిన రుసుము ను చెల్లించడంతో వారు ఉంటున్న ఇంటి స్థలాన్ని వారికే రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్యపు హక్కు కల్పిస్తూ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. దీంతో రమేష్ భార్య నిర్మల మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తో వచ్చి మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపింది. నల్లగుట్ట పరిధిలో సుమారు 600 కుటుంబాలు ఉన్నాయి. వారిలో కొందరు దరఖాస్తు చేసుకోగా, మరికొందరు దరఖాస్తు చేసుకొనేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ప్రభుత్వం కూడా తమ సమస్య పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. రెగ్యులరైజేషన్ తదితర సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అద్యక్షతన ఒక మంత్రి వర్గ ఉప సంఘం కూడా 7 గురు మంత్రులతో ఏర్పాటైంది.ఈ మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కూడా మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో, నగరంలోని పలు ప్రాంతాలలో ఉన్న ప్రజల నుండి వస్తున్న రెగ్యులరైజేషన్ డిమాండ్ గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page