minister stood by the journalist
జర్నలిస్టుకు అండగా మంత్రి పువ్వాడ -చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు ఆర్థిక సహాయం
సాక్షిత ఖమ్మం :
ఖమ్మంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలు లైన రఘునాథపాలెం మండల వార్త విలేకరి పాశం వెంకటేశ్వర్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అర్ధికంగా అండగా నిలిచారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి. జె.ఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి లు జర్నలిస్టు సమస్యను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లడంతో విషయం తెలుసుకున్న మంత్రి తక్షణమే స్పందించారు.
మంత్రి ఆదేశం మేరకు శుక్రవారం చైతన్య నగర్ లో నివాసం ఉంటున్న రిపోర్టర్ పాశం వెంకటేశ్వర్లు ఇంటికి మంత్రి పి ఎ రవి కిరణ్ వెళ్లి బాధితున్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొన్నారు. త్వరగా ఆర్యోగం మంచిగా కోలుకోవాలని వారికి ధైర్యం కల్పించారు. ఆనతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్థిక సహాయం ను రిపోర్టర్ వెంకటేశ్వర్లు కు అందజేశారు.
బాధితున్ని పరామర్శించిన వారిలో కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఐ జ్ ఎఫ్) జిల్లా అధ్యక్షులు అకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీ.ఎస్ చక్రవర్తి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, నగర అధ్యక్ష కార్యదర్శులు బాల బత్తుల రాఘవ, అమరవరపు కోటేశ్వరరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందుల జగదీష్, అశోక్, జిల్లా, నగర నాయకులు తిరుపతి రావు, ఉపేందర్, బిక్కీ గోపి, తదితరులు ఉన్నారు.