వాడ వాడ కు మంత్రి పువ్వాడ అజయ్

Spread the love

Minister Puvwada Ajay for Wada Wada

వాడ వాడ కు మంత్రి పువ్వాడ అజయ్

శ్రీకారం చుట్టనున్న మంత్రి అజయ్

సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించనున్న మంత్రి పువ్వాడ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అజయ్.. అజయ్.. అజయ్ ఇటు ప్రతిపక్షల్లో, అటు ప్రజల్లోనూ ప్రతి రోజూ ప్రతిధ్వనిస్తున్న పేరు. ఆ పేరంటేనే ఓ సంచలనం.సకల వర్గాల ప్రజలతో మమేకమవుతున్న మంత్రి పువ్వాడ అజయ్ ది ఐకాన్‌ ఆఫ్ ప్రోగ్రెస్ నడుస్తున్న రాజకీయచరిత్రలో తిరుగులేని శక్తిగా ఎదిగిన పువ్వాడ అజయ్ కుమార్ తనకు తానే సాటి ఆయనకు ఎవరూ సరిలేరు.

అయినప్పటికీ ప్రజలకు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ నూతన సంవత్సరం సందర్భంగా వాడ వాడ కు పువ్వాడ కార్యక్రమను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 1న మొదటిగా 17,27వ డివిజన్లలో వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు.

ఈ వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ తో పాటు మేయర్, మున్సిపల్ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు ఉండనున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికిఅక్కడే మంత్రి అజయ్ కుమార్ పరిష్కరించనున్నారు. భారీ జన సమీకరణాతో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే రెండుసార్లు ముఖ్యనాయకులు, కార్పొరేటర్లుతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page