ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

Spread the love

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 13,14వ తేదీల్లో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 13వ తేదీన పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకన్ గూడెం, గట్టు సింగారం, చేగొమ్మ, చౌటప్పల్ గ్రామాల్లో సీసీ రోడ్లకు శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లాలోని పురుషోత్తమాయగూడెంలో జరిగే గంగాభవాని దేవత విగ్రహా ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అదేవిధంగా తిరుమలాయపాలెం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో, నాయుడుపేట, ఇందిరమ్మ కాలనీల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో, పల్లెగూడెం, కామంచికల్ గ్రామాల్లో జరిగే ఆర్ అండ్ బీ రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అనంతరం ఖమ్మం అర్బన్ బల్లెపల్లిలోని బ్లూమింగ్ మైండ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.
14వ తేదీన… కూసుమంచి మండలం జీళ్లచెర్వులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారన్నారు. అదేవిధంగా కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం నేలకొండపల్లి మండలం చెన్నారంలో ఆర్ అండ్ బీ రోడ్ల శంఖుస్థాపన, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఆయా మండలాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page