SAKSHITHA NEWS

నీళ్ల ట్యాంక్ ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల స్థానిక ఒకటో వార్డు నందు అసంపూర్తిగా ఉన్న నీళ్ల ట్యాంకిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో వాటర్ ట్యాంకి నిధులు కేటాయించి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరిగిందని 80% పూర్తయిన పనులను గత వైసిపి ప్రభుత్వ హయాంలో 20% పనులను పూర్తి చేయకుండా వాటర్ ట్యాంక్ ని నిరుపయోగంగా ఉంచారని మండిపడ్డారు . ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అభివృద్ధి పనులను విస్మరించి ప్రచార ఆర్భాటాన్ని మాత్రమే నిర్వహించిందని తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ ఫుల్ పనులు నిల్ అనే చందంగా ఐదేళ్లు గడిపారన్నారు . గత 2024 ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటర్ ట్యాంక్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని అందులో భాగంగానే వాటర్ ట్యాంక్ ని పరిశీలించడం జరిగిందని త్వరలోనే వీటికి నిధులు కేటాయించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి , కౌన్సిలర్ నాగార్జున తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app