SAKSHITHA NEWS

[ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి కేటీఆర్ మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారం తో హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతా – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.


సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ లో రూ.40.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టు కొని వరద నీటి కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియచేశారు.ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని పనులలో వేగం పెంచాలని ప్రతి కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అని, సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి కేటీఆర్ మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారం తో హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి డివిజన్ గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని మరియు వరద నీటి కాల్వ నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియజేయడం జరిగింది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, హైదర్ నగర్ డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్ జలమండలి అధికారులు డీజీఎం వెంకటేశ్వర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ వాసులు నాగ వరప్రసాద్, అంజయ్య, కోటిరెడ్డి, శ్రీనివాస్ రావు, కోటేశ్వర్ రావు, వెంకట్రావు, కుమార స్వామి, సురేష్, రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS