SAKSHITHA NEWS

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముసునూరువారిపాళెం గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, ముసునూరువారిపాళెం, కొత్తపాళెం, వాగర్త హరిజనవాడ, దిబ్బమీద హరిజనవాడల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .*

యంత్ర సేవా పథకం కింద రూ. 15 లక్షలు విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందజేసిన మంత్రి కాకాణి.
మంత్రి కాకాణికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
ముసునూరువారిపాళెం గ్రామంలో 5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను మంజూరు చేశామన్న మంత్రి కాకాణి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
మూడేళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగల్గుతున్నాం.
గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ, ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలు ఏ మేరకు అందాయో తెలుసుకొని, ఏదైనా సాంకేతిక కారణాలతో అందకపోతే అందించడమే అజెండాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
వార్డు స్థాయి సభ్యుడి నుంచి మంత్రి స్థాయి వరకు ప్రజాప్రతినిధులు అందరూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఒక సంవత్సరం నుంచి కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.


గ్రామాల్లో పర్యటించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని వాగర్త హరిజనవాడ, దిబ్బమీద హరిజనవాడలో 2 కోట్ల 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశాం.
సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాం.
ముత్తుకూరు మండల ప్రాంత వాసులు అందరికీ నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీని అందించాం.
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

WhatsApp Image 2023 04 25 at 12.51.22 PM

SAKSHITHA NEWS