SAKSHITHA NEWS

Minister Kakani Govardhan Reddy inspected the rain affected areas along with the officials

మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి


సాక్షిత : మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకుంటామని స్పష్టం చేసిన మంత్రి*

క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, ఏ ఒక్క రైతు నష్టపోకుండా 80% సబ్సిడీతో విత్తనాలు, దెబ్బతిన్న పంటలకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఉదారంగా అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పిన మంత్రి కాకాణి*

జిల్లాలో ముందస్తుగా చేపట్టిన చర్యలతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, కొంతమేర మాత్రమే నష్టం వాటిల్లిందని, రైతులకు అన్ని విధాల అండగా నిలిచే గొప్ప మనసున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉండడం మన అదృష్టంగా పేర్కొన్న మంత్రి కాకాణి.*

టిడిపి హయాంలో 716 కోట్ల నష్టపరిహార బకాయిలను ఎగ్గొట్టిపోయిన టిడిపి నేతలు నేడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తిన మంత్రి కాకాని*

నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం

716 కోట్ల పంట నష్ట పరిహార బకాయిలు ఎగొట్టిన టిడిపి నేతలు నేడు మాట్లాడడం హాస్యాస్పదం

.. వ్యవసాయం అంటే తెలియని టిడిపి నేతలు మాట్లాడుతున్నారు

.. టిడిపి హయాంలోనే నియమ నిబంధనలతో రైతులకు అన్యాయం

.. నేడు రైతులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరిస్తున్నాం

వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలాల వారీగా నష్టపోయిన రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అంచనాలను తయారు చేయిస్తున్నామని, జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ హాయంలో అనేక నియమ నిబంధనలతో పంట నష్టపరిహారంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని కానీ నేడు రైతులను ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నామన్నారు.

ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉద్యానవన పంటలతో పాటు వ్యవసాయ పంటలు నారు ముళ్ళు ఇతర పంటలు సాగు చేసే ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. అగ్రికల్చర్ అధికారులు ఇప్పటికే అంచనాలను తయారు చేస్తున్నారన్నారు.

రైతులను రెచ్చగొట్టాలని టిడిపి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతులను గుర్తించి ఇప్పటికే అంచనాలను తయారు చేయిస్తున్నామని, అంతలోపల టిడిపి నేతలు అర్ధరహితంగా విమర్శలు చేస్తున్నారన్నారు.

రైతులను టీడీపీ అడుగడుగున దగా చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని ఈ సీజన్ లోనే అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు.


SAKSHITHA NEWS