SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బాల్ రెడ్డి నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…

131- కుత్బుల్లాపూర్ డివిజన్ బాల్ రెడ్డి నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… గత పదేళ్ల కాలంలో బాల్ రెడ్డి నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కూడా కాలనీ అభివృద్ధికి
నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గా రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రిష్ణ మూర్తి, సలహాదారులు సుధాకర్ రెడ్డి, లక్ష్మయ్య, రామారావు, లింగారెడ్డి, శ్రీనివాసరావు, కోశాధికారి వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app