కిడ్నీ బాధితులకు అండగా ఉంటా.
మేయర్ డాక్టర్ శిరీష
సాక్షిత : కిడ్నీ భాదితులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు.
శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్, కిడ్నీ పేషెంట్ హెల్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య, దాతలు మురళీధర్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు మేయర్ డాక్టర్ శిరీష చేతులు వారి మీదుగా కిడ్డి బాధితులకు ఉచితంగా మందులు, ఇంజక్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం వారు ప్రతి నెల ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా డయాలసిస్ చేస్తున్నారని మరియు ప్రతి నెల పదివేల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నారని తెలియజేశారు. కిడ్నీ బాధితులతో మాట్లాడుతూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వెంకట్రామయ్య, భాస్కర్, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.