SAKSHITHA NEWS

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ వద్ద (BHEL ప్రధాన గేట్ నుండి కల్వరి టెంపుల్ వద్ద గల రిజర్వాయర్ వరకు) మంజీర రోడ్డు లో రూ. 40 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో 7 KM మేర నూతనంగా చేపట్టబోయే మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు గౌరవ ఎంపీ శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి , గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , శ్రీ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మంజీర రోడ్డు లో పాత పైప్ లైన్ 1960 లో వేయడం వలన పాతది అయిపోయి లీకేజీ లు ఏర్పడి నీటి వృధా అవుతుంది అని, లీకేజీ వలన రోడ్లు దెబ్బతినడం వలన చుట్టుపక్కల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని , ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ దృష్టికి మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ దృష్టికి తీసుకుపోవడం జరిగినది అని, అసెంబ్లీ లో వారి దృష్టికి తీసుకువెల్లగా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసి నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరనుంది అని , లీకేజీల కు ఇక చెల్లు అని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ కి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం లభించింది అని , స్వచ్చమైన త్రాగు నీరు అందించడమే లక్ష్యం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

WhatsApp Image 2023 10 06 at 7.20.14 PM

ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని, ఈ రోజు శుభదినం అని మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని, ఎన్నో ఏండ్ల మంచి సమస్య నేటి సమస్య తిరినది అని ,అసంపూర్తిగా మిగిలిపోయిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గాంధీ కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగినది ,వాటర్ వర్క్స్ బోర్డ్ నిధుల ద్వార మంజూరు అయిన నిధులతో చేపడుతున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఎన్నో సంవత్సరాల నుండి నెలకొన్న సమస్య నేటి తో తీరునని కాలనీ వాసుల కోరిక మేరకు పాత మంచి నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేయటం జరిగినదిఅని,ఎన్నో ఏండ్ల కలుషిత నీటి సమస్యనుండి నేటి తో విముక్తి లభించింది అని ఇకనుండి సురక్షిత మంచినీరు ఇవ్వడం జరుగుతుందని కాలనీ వాసుల సమస్య నేటి నుడి తీరనుందని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది.అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెచ్చిన కార్యక్రమం అని, నెలకు 20,000 ల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చేసి లబ్ది పొందేలా చూడలని, ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని , ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కలిపించాలని, పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని, అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపట్టడం జరుగుతుందని మరియు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటి ని ఇవ్వడం జరుగుతుందని ,మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని . నియోజకవర్గం లో 18 రిజర్వాయర్ లు నిర్మాణం చేసుకున్నామని .ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ,మరియు నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తామని చెప్పడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

WhatsApp Image 2023 10 06 at 7.20.15 PM

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు , బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS