క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *

Spread the love

కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాద పూర్వకంగా కలసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి …

మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో “ఆర్చ్ బిషప్స్ హౌస్” హైదరాబాదులోని కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , మరియు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత , కంటోన్మెంట్ ఇంఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

తదనంతరం ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మనిషి ఎదుటివారిని ప్రేమించగలగటమే గొప్పలక్షణం, అని అలా ప్రేమించలేనివారు మనుషులే కాదు.తప్పు చేయాలని ఏ మతం బోధించదు. శాంతి సహనంతో జీవించాలనే మతాలన్నీ చాటి చెప్పాయి. మతం ఉన్మాదంగా మారి కొందరు రాజులు గుళ్లపై, మరికొందరు మసీదులపై దాడులు చేశారు.. వాటివల్ల ఒనగూరిందేమీలేదు. నేడు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు కూడా తాత్కాలికమే..మానవత్వమే కలకాలం కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఏడుపు, బాధ, సంతోషం ఒకేలా ఉంటాయి. దేశ జీడీపీలో అందరి భాగస్వామ్యం ఉంటుంది..అందులో ఎలాంటి రంగులు, తేడాలు ఉండవు.సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతిమార్గంలో నడవాలని, ప్రతి మతం ఇదే విషయాన్ని చాటి చెప్పిందని మతం ఉన్మాద స్థితికి చేరుకొంటేనే ప్రమాదమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం పట్టని మత తత్వ పార్టీలను నమ్మొద్దు అన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page