రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది.
భారీ వర్షాల నేపథ్యంలో విస్తృత చర్చ
మంత్రివర్గ ఎజెండాలో 50 అంశాలు
పలు కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపైనా చర్చించనున్నది. ప్రత్యామ్నాయ సాగు విధానాలపైనా చర్చించే అవకాశం ఉన్నది. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది.