Maharashtra Minister Sudhir Muniganti War visited Rajanna
రాజన్నను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటి వార్
యాంకర్ వాయిస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని మంగళవారం మహారాష్ట్ర అటవీ, సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటి వార్ దర్శించుకున్నారు. వేములవాడ చేరుకున్న అయన.. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తాసిల్దార్ రాజిరెడ్డి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వాయిస్ ఓవర్ : రాజన్న తమ ఇంటి కుల దైవమని,ప్రతి ఏడాది స్వామివారి దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని ప్రజాసేవను ప్రారంభిస్తాననీ అన్నారు.ప్రజల హృదయాల్లో బిజెపి పార్టీ ఉందనీ,ప్రధానమంత్రి మోడీ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని చూసి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మోడీ పరిపాలననే స్వాగతిస్తున్నారన్నారు. దేశంలో గత పార్టీలు చేసిన అభివృద్ధిని చూడండి. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి ఏ పార్టీ వారైనా ఆయనను పొగడగా తప్పదనీ కొనియాడారు.మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు అధికంగా ఉండే భీమండి, సోలాపూర్, చంద్రపూర్ ప్రజల కోసం తెలుగు అకాడమీ ని కూడా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించామని చెప్పారు.ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండబోదనీ,
మహారాష్ట్రతో పాటు దేశంలో కెసిఆర్ హవా వస్తది అనేది ప్రోపగండ మాత్రమే అని అన్నారు.నిజామాబాదులో ముఖ్యమంత్రి కూతురు కవితనే ఓడిపోయింది. అలాంటిది బయటకు వచ్చి ఇతర రాష్ట్రాల్లో ఏలా గెలుస్తారనీ,మిషన్ తెలంగాణలో భాగంగా మోడీ సునామి తప్పదనీ,మూడు స్థానాలు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 50 స్థానాలు గెలిచామని,వచ్చే ఎన్నికల్లోను మా సత్తా చూపుతామని అన్నారు.