విజయవాడ: రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది..
ఈ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. రెడ్ బుక్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసును ఏసీబీ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది..