స్థానిక సమస్యలు పరిష్కరించాలి

Spread the love

మంత్రి జోగి రమేష్ కు కో- ఆప్షన్ సభ్యులు పఠాన్ నాగుల్ మీరా వినతి

సానుకూలంగా స్పందించిన మంత్రి

కేతనకొండ మరియు మండల పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు వినతిపత్రం సమర్పించారు మండల కో- ఆప్షన్ సభ్యులు పఠాన్ నాగుల్ మీరా.

మంగళవారం నాడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కేతనకొండ గ్రామంలో సమస్యల పరిష్కారం గురించి మాట్లాడారు….. వివిధ సమస్యలపై ఆయనకు వివరించారు. ముఖ్యంగా మంచినీటి సమస్య మరియు జగనన్న ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలపై దృష్టి సారించి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని…… లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు….

Related Posts

You cannot copy content of this page