జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సీసాల బస్తీలో నెలకొన్న సమస్యలపై జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు స్థానిక నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ పనులను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకవచ్చారు.
దీంతో స్పందించిన కార్పొరేటర్ బస్తీలో పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్ ను త్వరలోనే పూర్తి చేస్తానని హామి ఇచ్చారు. ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొలుకుల జైహింద్, స్థానిక నాయకులు , సత్యరాజ్, హాజీ సన్నీ బాయ్ సునీల్ కిరణ్ యాదగిరి.తదితరులు పాల్గొన్నారు.