అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని …
జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు…
జిల్లాలో 2247 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…
ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ , కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోమ్ గార్డ్స్ -800 మంది, CID- POLICE- అంతే కాకుండా పోలింగ్ స్టేషన్లో NCC /NSS వాలంటీర్ కూడా ఉపయోగిస్తామని అన్నారు.
జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు
జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషను లు 927, సాధారణ పోలింగ్ స్టేషన్లు 807 , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120
జిల్లా వ్యాప్తంగా 8,19,838 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషులు 3,92,257 మంది, మహిళ లు 4,27,546 మంది, ట్రాన్స్ జెండర్స్ 35 మంది ఉన్నారని అన్నారు.
స్వాధీన పరుచుకున్న వివరాలు :
ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 2,21 ,53,310 /- రూపాయలు.
లిక్కర్ లీటర్ల లో 2769 సుమారుగా అంచనా విలువ 14,43,015 /-రూపాయలు
ఇతర సామాగ్రి: సుమారుగా అంచన విలువ 67,45,011 /- రూపాయలు.
గోల్డ్:1.506 kgs సుమారుగా అంచన విలువ 90,00,000 /- రూపాయలు.
గంజాయీ: 15.81 kgs సుమారుగా అంచన విలువ 3,95,000/- రూపాయలు.
సీజ్ చేసినా నగదు, లిక్కర్, గంజా గోల్డ్, ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ 3,97,36 ,336 /- రూపాయలు..
జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 612…
లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 Cr.pc అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది , ఇప్పటికే జిల్లా లో ఉన్న మొత్తం 45 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.