సాక్షిత : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు ..
ఈనెల 8న అచ్చంపేటకు మంత్రి రాక
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ
ఉప్పునుంతల మండలానికి సంబంధించిన 17కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
అచ్చంపేట: మంత్రి కేటీఆర్ అచ్చంపేట పర్యటనను దిగ్విజయం చేద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ మరియు స్పోర్ట్స్ కీట్ల పంపిణీ, అదేవిధంగా ఉప్పునుంతల మండలానికి సంబంధించిన 17కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళల కోసం ప్రత్యేకంగా దసరా కానుకగా చీరల పంపిణీ చేయడం జరుగుతుందనీ మరికొద్ది రోజులు దసరా పండుగ ఉన్నందున ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలపై ఉన్న అభిమానంతో తన అక్కా చెల్లెలు అమ్మలతో సమానం గా భావించే కెసిఆర్ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ ఒకే రకంగా చీరలు పంపిణీ చేస్తూ సమానంగా గౌరవిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొనియాడారు. ప్రతి విషయంలో మహిళలకు గౌరవం కలిగిస్తున్న ముఖ్యమంత్రిని గుండెల్లో పెట్టుకోవాలని మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మహిళలను కోరారు.
అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టనున్న ఉమామహేశ్వర, లక్ష్మి చెన్నకేశవ, మద్దిమడుగు అంజన్న, నిరంజన్ షా వలి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ శంకుస్థాపన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పైలాన్ ఆవిష్కరణ చేయనున్నారు. అదేవిధంగా ప్రజలు రైతులతో భారీ బహిరంగ సభ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభకు ప్రజలు, రైతులు, యువకులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.