ప్రతి ఉదయం ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిద్దాం

Spread the love

Let’s create a pleasant environment for people every morning

ప్రతి ఉదయం ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిద్దాం.

  • రాత్రి పారిశుద్ధ్య పనులు పరిశీలించిన మేయర్

ప్రతిరోజు నగరప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.
గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు నగరంలో జరిగిన నైట్ స్విపింగ్ పనులను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.

రాత్రి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, ఎంఆర్ పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ సర్కిల్, నెహ్రు నగర్, పాత అలిపిరి రోడ్డు మొదలు ప్రదేశాల్లో జరుగుతున్న నైట్ స్విపింగ్ పనులను పరిశీలించారు


రాత్రులలో జరుగుతున్న నైట్ స్విపింగ్ గురించి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి అడిగి తెలుసుకున్నారు. నగరం హోటల్స్, టిఫిన్ అంగడి, టీ స్టాల్స్ వారితో మాట్లాడుతూ మీ షాపులు వద్ద పరిసరాలు ప్రాంతాలలో తడి, పొడి చెత్త లు కొరకు డబుల్ బిన్ ఏర్పాటు చేసుకొని నగరపాలక పారిశుద్ధ కార్మికులకు అందించాలని ఆదేశించారు

.శానిటరి సూపర్వైజర్ ఉద్దేశించి ఇండోర్, భువనేశ్వర్, మైసూర్ నగరాల కన్నా మన తిరుపతి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆదేశించారు. నగరంలో ప్రతి ఉదయం ఆహ్లాదకరంగా ఉండడానికి, తాజా వాతావరణాన్ని అందించడానికి నగరంలో నైట్ స్విపింగ్ పనులను బాగా జరగాలని తెలియజేశారు. మేయర్ శిరీష వారితో పాటు శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page