Leave modern food habits and lifestyle..Indian traditional food..Jiva
ఆధునిక ఆహారపు అలవాట్లు,జీవనవిధానం విడనాడి..దేశీయ సాంప్రదాయక ఆహారం..జీవనవిధానం అలవర్చుకోవాలి..!
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
సాంప్రదాయక వంటకాల ఆహారం అమృతం..మానవుని శరీరానికి దివ్యఔషధం..!
రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నీలగిరి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణం లోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ భాగ్యనగర్ బ్రాంచ్ యాజమాన్యం ఆధ్వర్యంలో వివిధ రకాల సంప్రదాయక వంటకాలతో ఆహార పదార్థాలను తయారు చేసి విన్నూతనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి – విద్యార్థునులు, ఉపాధ్యాయ – ఉపాధ్యానులు పాల్గొని తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిభింబించే వంటకాలు చేసి ఆహారమే పరమ అవశదమని చాటి చెప్పడం కోసమే నిర్వహించిన విన్నూత్న కార్యక్రమం ప్రశంసలందుకుంది. ఆకట్టుకున్నారు.
ఈ సందర్బంగా స్కూల్ మేనేజ్మెంట్ రఫత్ బేగం మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన విధానంతో కలిగే నష్టాలను వివరిస్తూ విద్యార్థులు జంక్ ఫుడ్లు తినకుండా సాంప్రదాయక ఆహార పదార్థాలనే తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని హితవు పలికారు.సాంప్రదాయకంగా పండించే ఆహార దాన్న్యాల తోవదించే ఆహార పదార్థాల్లో ఉన్న ఆరోగ్య సూత్రాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
సంప్రదాయ వంటకాలు అమృతంలాంటివి..అవి ఔషధంగా మన శరీరాన్ని కాపాడతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమం లో స్కూల్ యాజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ ma సత్తార్,జోనల్ ఇంచార్జ్ మా వహీద్ ,ప్రిన్సిపాల్ రఫత్ సుల్తానా, ఉపాధ్యాయ- ఉపాధ్యానులు ,విద్యార్థి-విద్యార్థునులు,తల్లిఆంధ్రులు పాల్గొన్నారు.