కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.

Spread the love

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని విభాగాల అధికారులతో ఈ ఐదు రోజులు జరిగిన పాదయాత్రకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు… ఇందులో ప్రధానంగా మంచినీరు సరఫరా గురించి ప్రజలు ఎక్కువ వినతి పత్రాలు అందించిన నేపథ్యంలో నీటి పైపులు నిర్మాణం కొరకు మరొక కోటి రూపాయలు కేటాయిస్తూ నెలరోజుల్లోపు పనులు పూర్తిచేసి ఎక్కడా కూడా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు…

అలాగే పెండింగ్లో ఉన్న రోడ్లు పనులు కూడా ఆగస్టులో  పూర్తి కావాలని ఎట్టి పరిస్థితుల్లోని అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు… అలాగే డ్రైనేజ్ వ్యర్ధాలు మరియు చెత్త తీయుట కొరకు ప్రత్యేకంగా వాహనాలను కేటాయించామని మరొక 20 రోజుల్లో ఆ వాహనాలు అందుబాటులో ఉంటాయని ఈలోగా ప్రజలకు ఆసౌకర్యం కలకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించే ఏర్పాట్లు చూడాలని సూచించారు.. విద్యుత్తు లైన్లు కొత్త స్తంభాలుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతులకు పరిష్కారం చూపాలని పాదయాత్రలో ఎక్కడికక్కడ ఫిర్యాదులు అందిన దగ్గర వారి సమాచారం స్వీకరించిన నేపద్యంలో.. వెంటనే అక్కడ సమస్యను పరిష్కరించాలని అధికారులు అందరికీ ఆదేశించారు …

అలాగే అంగన్వాడీ సిబ్బంది మరియు బస్తీ దవాఖాన వైద్యులతో మాట్లాడుతూ  గర్భిణీలకు.. నిరుపేదలకు  అందుబాటులో ఉండాలని కెసిఆర్ కిట్ ..పౌష్టికాహారం కిట్ల ను అందరికీ అందేటట్టు చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవి ఏర్పాటు చేశారని అన్నారు… మరియు డబుల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్ పారదర్శకంగా జరగాలని ఎక్కడైనా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపడానికి కూడా వెనుకాడ బోమని హెచ్చరించారు…. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్… అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page