కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు.

Spread the love

కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు.

22 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన కృష్ణాజిల్లా పోలీసులు.

గంజాయి స్మగ్లర్ల పై ఉక్కు పాదం మోపే ప్రత్యేక కార్యచరణ రూపొందించి ఫలితాలు రాబట్టిన కృష్ణా జిల్లా పోలీసులు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 పోలీస్ స్టేషన్లో,22 మంది ముద్దాయిల అరెస్ట్,40 కిలోల గంజాయి,3 గ్రాములు MDMA, ఆటో, బైక్,16 సెల్ఫోన్ స్వాధీనం.

గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ.

గంజాయి కేసులో చిక్కుకున్న ప్రతి ఒక్కరి వయసు 30 ఏళ్లలోపే. క్షణికానందం కోసం గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నత అభివృద్ధిని సాధించాల్సిన వయసులో కేసులపాలై జీవితాలను ఆగాధం చేసుకుంటున్నారు. అలా NDPS act కు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి మాదిక విభయాలు గంజాయి వంటి వాటిని వినియోగం విక్రయాలు నిర్వహిస్తూ వున్న వారందరినీ అదుపులోనికి తీసుకొని ఇకపై వారు గంజాయి విక్రయాలకు, రవాణాకు మరలకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 5 పోలీస్ స్టేషన్లో మొత్తం 22 మంది ముద్దాయిలను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 40 కిలోల గంజాయిని సీజ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయావరణంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారి యొక్క కేసు పూర్వాపరాలను జిల్లా ఎస్పీ గారు వివరించారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మత్తుపదార్ధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణాకు పాల్పడుతున్న 22 మందిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు.

రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్

  1. దారపురెడ్డి సాయి కుమార్ తండ్రి పేరు మురళీకృష్ణ 25 సంవత్సరాలు.
  2. తుంగల చందు తండ్రి పేరు నరసింహారావు 21 సంవత్సరాలు మచిలీపట్నం
  3. దాసరి ప్రజ్వల్ కుమార్ తండ్రి పేరు సురేష్ 21 సంవత్సరాలు పోతేపల్లి
  4. కొండరపు లోవరాజు తండ్రి పేరు నూకరాజు 25 సంవత్సరాలు విశాఖపట్నం.ఇతను గంజాయి సరఫరాలో ప్రధాన నిందితుడు. ఇతను జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో 6 కేసులు కలవు.
  5. డొక్కు కాటంరాజు శ్రీనివాసరావు 21 సంవత్సరాలు యాదవ మచిలీపట్నం
  6. పాలిశెట్టి పవన్ కుమార్ తండ్రి పేరు పాండురంగారావు 20 సంవత్సరాలు మచిలీపట్నం.
  7. నూలు సాయి తండ్రి బ్రహ్మం 22 సంవత్సరాలు మచిలీపట్నం.

వీరందరిపై 02.04.2023 తేదీన అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది వీరంతా ఆర్థికపరంగా వెనుకబడిన కుటుంబాలైనప్పటికీ చిన్న చిన్నలకు వ్యసనాలకు బానిసలై, క్షణికానందాన్ని ఇచ్చే గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు పాల్పడుతూ, వీరే కాక మరి కొంతమందిని యువతను పక్కదోవ పట్టిస్తూ, నేర ప్రవృత్తి కలిగి ఉన్నారు అంతేకాక వేరే ప్రాంతాలకు కూడా గంజాయిని ఎగుమతి చేస్తూ విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెళ్లడయింది. వీరి వద్దనుండి 13 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకొని ఆటో, బైక్ను సీజ్ చేయడం జరిగింది.

గూడూరు పోలీస్ స్టేషన్

1.బలుపూరి కిషోర్ తండ్రి పేరు శ్రీను 19 సంవత్సరాలు మలవోలు

  1. పితా రవితేజ తండ్రి పేరు శ్రీనివాసరావు 20 సంవత్సరాలు రేపల్లె.
  2. అమృతలూరి దయాకర్ తండ్రి పేరు భాస్కరరావు 17 సంవత్సరాలు బేతపూడి.

పై ముగ్గురు నేరస్తులు IT చదువును పూర్తి చేసుకొని ఒకవైపు ప్రవేటు ఉద్యోగాలు చేస్తూనే సులభ సంపాదన కోసం గంజాయి అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వారి వద్ద నుండి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఇదివరకే వీరిపై రెండు కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాక వీరంతా కూడా 30 ఏళ్లలోపు వారే అవ్వటం బాధాకరం.

గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్

1.బండి తంబి తండ్రి పేరు కోటేశ్వరరావు 25 సంవత్సరాలు అంగులూరు

  1. కొండ రాకేష్ తండ్రి పేరు జోసెఫ్ 23 సంవత్సరాలు గుడ్లవల్లేరు
  2. కాటూరి సుబ్రహ్మణ్యం తండ్రి తండ్రి పేరు కృష్ణ 28 సంవత్సరాలు ఉయ్యూరు.
  3. మహమ్మద్ అక్బర్ బాషా తండ్రి నాగూర్ భాష 22 సంవత్సరాలు గుడ్లవల్లేరు.
  4. పెనుమూడి చందు తండ్రి పేరు నాగపూత రాజు 23 సంవత్సరాలు ముదినేపల్లి
  5. మర్రి మెక్ మిలన్ తండ్రి పేరు 25 సంవత్సరాలు మండవల్లి

పై ముద్దాయి లందరూ గంజాయిని విక్రయాలకు పాల్పడుతూ విద్యాలయాలలో గ్రామ మారుమూల శివారు ప్రాంతాలలో అమ్మకాలు జరుపుతూ సులభ మార్గంలో డబ్బు సంపాదించడమే కాక మత్తుకు బానిసలై అనేక అల్లరి కార్యక్రమాలకు కూడా తెగబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి వీరిని అదుపులోనికి తీసుకొని వీరి వద్దనుండి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఆత్కూరు పోలీస్ స్టేషన్

  1. నాగిరెడ్డి తరుణ్ తండ్రి పేరు మహేశ్వరరావు 22 సంవత్సరాలు విజయవాడ
  2. రేసభు చంద్రశేఖర్ రెడ్డి పేరు చలపతి రెడ్డి 27 సంవత్సరాలు గాజువాక
  3. లండ ప్రేమ్ కిరణ్ తండ్రి సత్యనారాయణ 24 సంవత్సరాలు విజయవాడ.
  4. ఏపూరి బాబురావు తండ్రి వెంకటేశ్వరరావు 20 సంవత్సరాలు విజయవాడ

ఇతను బీటెక్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో చెడు వ్యసనాలకు బానిసై అదే సమయంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు అంతేకాక తన తోటి సహచర విద్యార్థులకు కూడా గంజాయిని విక్రయిస్తూ చెడు నడత కలిగి ఉన్నాడు.

పై రెండు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో ఇద్దరు ముద్దాయిలని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 3 కేజీల గంజాయిని మరియు 3 గ్రాముల HD డ్రగ్, 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది.

పెనమలూరు పోలీస్ స్టేషన్

  1. ఘట్టమనేని సాయి ప్రసాద్ తండ్రి పేరు లక్ష్మీ ప్రసన్న 19 సంవత్సరాలు గంగూరు
  2. గోరంట్ల కిరణ్ తండ్రి పేరు శ్రీను 22 సంవత్సరాలు గోసాల

విరి వద్ద నుండి 4 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేటి యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రత్యక్షంగా లేకపోవడం, వారు ఎవరి స్నేహంలో ఉన్నారో గమనించుకోకపోవడం, చెడు స్నేహాల బారిన పడి బంగారు భవిష్యత్తును యువత కాలరాసుకుంటున్నారు. ఇందులో ఆరుగురు బీటెక్, ఉన్నత విద్య అభ్యసించిన వారు, నలుగురు ఐటిఐ , ఇద్దరు డిగ్రీ పూర్తి చేసిన వారు ఉండడం చాలా బాధాకరమైన విషయం. వీరంతా వీరి ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరితో ఒకరు పరిచయాలు ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా వినియోగం వికారాలు నిర్వహిస్తున్నారు. బీర్లు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న లోవరాజును ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో చాకచక్యంగా పట్టుకున్నారు. అంతేకాక ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనపై గమనించుకుంటూ ఉంటూ, వారి స్నేహాల పైన పూర్తి పర్యవేక్షణ ఉండాలి. ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం విక్రయాలు రవాణా వంటి వాటికి పాల్పడితే వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్యోటోపిక్ సబ్ స్టెన్స్ ఆక్ట్-1985 (NDPS act) ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని, నిషేధించబడిన మత్తు పదార్థాలను ఎవరైనా కలిగి ఉన్న వారికి 10 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష మరియు లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు జరిమానా మొత్తం ఇంకా అధికంగానే ఉండవచ్చు.

గంజాయి మొక్కల సంబంధించిన నిబంధనలు ఉల్లంగిస్తే వారిపై 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.

ఇలా చిన్నచిన్న క్షణికానందాలకు పోయి కేసుల పాలు కావద్దని, ఎన్నిసార్లు కేసులు నమోదైనప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే, వారిపై PD act ను అమలుపరిచేలా కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని కనుక సన్మార్గంలో నడవవలసిన యువత పెడత్రోవ పడితే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని ఎస్పీ గారు హెచ్చరించారు. అంతేకాక ఈ కేసులో ఉన్న వారందరిని విచారణ జరిపి దీని మూలాలు ఎక్కడ వున్న వాటిని తేల్చితం గంజాయి కి సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్న నేరుగా తెలియజేయవచ్చు తెలిపిన వారి యొక్క వివరాలు గోపియంగా ఉంచబడతాయి అలాగే వీరందర్ని అదుపులోనికి తీసుకోవడానికి ప్రత్యేకంగా కృషిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page