ప్రత్యేక పూజానిర్వహించిన యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.పి.విశాల్ గౌడ్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, రంగారెడ్డి నగర్, నందానగర్, వెంకటేశ్వర నగర్, కుత్బుల్లాపూర్ గ్రామం మరియు
పలు కాలనీలలో, బస్తీలలో సంక్షేమ సంఘం వారు, యూత్ అసోసియేషన్ల వారు ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద,వారి యొక్క ఆహ్వానం మేరకు,
ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రత్యేక పూజా
కార్యక్రమాలను నిర్వహించిన యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.పి.విశాల్ గౌడ్ .
కుత్బుల్లాపూర్ గ్రామంలో,టెంపుల్ సీట్లో నెలకొల్పిన గణనాధుని లడ్డూ వేలంలో మరియు నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు విశాల్ .
లడ్డు వేలం పాటలో రూపాయలు 75,000 వేలకు, వేలం పాట పాడి, లడ్డూను కైవసం చేసుకున్న మొహమ్మద్ రషీద్ మరియు ఆయన కుమారులు మొహమ్మద్ రియాజ్, మహమ్మద్ లియాకత్ అలీ.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ హిందువులతో పాటు ముస్లిం, సిక్కు, ఇసాయి సోదరులు కలిసి జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి అని అన్నారు.


లడ్డు వేలం పాటలో, లడ్డూను ముస్లిం సోదరులు కైవసం చేసుకోవడం మతసామరస్యానికి ప్రతీక అన్నారు.
గణనాధుని ఊరేగింపు, నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు టెంపుల్ స్ట్రీట్ వినాయక కమిటీ వారిని అభినందించారు విశాల్ .


ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఠాకూర్ రాజేందర్ సింగ్, రత్నం మురళి గౌడ్, గోపగోని నరహరి గౌడ్, బండి బిక్షపతి గౌడ్,పెద్ది మల్లేశం, పోచయ్య, రామన్, రత్నం సత్యనారాయణ గౌడ్.
టెంపుల్ స్ట్రీట్ వినాయక కమిటీ సభ్యులు ఉత్తేజ్, సాయి ప్రసాద్, వంశీ, సునీల్ పాండే, మహేష్, అనిల్ పాండే, రాజేష్, నవీన్ గౌడ్, ప్రవీణ్, సూరి, ప్రశాంత్ గౌడ్.
యూత్ నాయకులు కన్నా, రాజ్ ఠాకూర్, నార్ల కంటి శ్యామ్, మరియు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సోదరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page