కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 127వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్. హన్మంత్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహ దాత కొలన్. హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ… ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి.. ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే చెందుతుందని తెలిపారు. ఐటీ రంగంలో భారత్ అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమేనని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్.. సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని కొనియాడారు కొలన్. హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గాంధీ నగర్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు జల్దా రాఘువులు , కుత్బుల్లాపూర్ సర్కిల్ మైనారిటీ చైర్మెన్ మొహమ్మద్ ఖాజామియా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్,సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, మేకల ఎల్లయ్య, వీరేష్ గుప్తా, తైలం శ్రీనివాస్, షేక్ మొహమ్మద్ పాషా, బుయ్యని శివకుమార్, బిక్షపతి, నజీర్, జాఫర్ ఖాన్, గణేష్, శ్రీనివాస్ చరి, నాగరాజు, శ్యామ్, అంజాద్, నయీమ్, షఫీ, మహిళా నాయకులు రాధమ్మ, కౌసల్య, కుమారి మరియు NSUI నాయకులు ,యువజన నాయకులు తదితరులు పాలొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,