3వ విడుత లో రెండవ భాగం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్‎లో 2550 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన హోం మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ లో మూడో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమానికి హోమ్ శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్ , తో కలిసి ఇండ్లు పట్టాల పంపిణీ చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని చేపట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.


పేద ప్రజలు ఎంతో సంతోషంగా బతకాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు జిహెచ్ఎంసి పరిధిలో ఎంతో విలువైన స్థలాల్లో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని. అందులో భాగంగా నేడు 3వ విడుత లో రెండవ భాగంలో ర్యాండమైజేషన్ పద్ధతిలో లక్కీ డ్రా ద్వారా ఎంపీనకైనా కుత్బుల్లాపూర్ లబ్ధిదారులకు ఇండ్ల పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్.డి.ఓ శ్యామ్ ప్రసాద్, జోనల్ కమీషనర్ మమతా, నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ లు, మున్సిపల్ డివిజన్ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులూ, మహిళా నాయకులూ, లబ్ది దారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page