స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కాపాడండి.

Spread the love

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కాపాడండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్


సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరంలో 470 ఎకరాల్లో విస్తరించిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని వెంటనే పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ చూసిన ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయని అధికారుల నిర్లక్ష్యం వల్లే భూములు బావిష్యతులో దోరకలేని ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ కార్పొరేషన్ వాళ్ళు ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు మాకు సంబంధం లేదు అనుకుంటా ప్రభుత్వ భూమిని కబ్జాదారులను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. గతంలో కబ్జాదారులు చీకటి సమయంలో, సెలవు రోజుల్లో కబ్జాలు చేసేవారని కానీ నేడు బహిరంగంగా అన్ని సమయాల్లో ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కడుతున్నారని మరి ఇంతగా విఫలమైన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులను ఎప్పుడు చూడలేదని అన్నారు.

ప్రభుత్వ భూముల కబ్జాలో గాజులరామరం చరిత్ర సృష్టిస్తే దానికి కారణం ప్రజాప్రతినిధులు, అధికారులు మొతంగా నేటి తెలంగాణ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఎవరైనా పిర్యాదు చేస్తే అప్పుడు తూతుమంత్రంగా కూల్చివేత్తలు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ప్రభుత్వ భూములను కాపాడట్లేదని అన్నారు. కూల్చివేత్తల వల్ల లక్షలు పెట్టి కొనుక్కున్న సామాన్య ప్రజానికమే నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారని, కబ్జాదారులు,వారికి సహకరించిన అధికారులు మాత్రం ఇంకొంత డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు.


భూములు రక్షించటానికి ప్రైవేట్ సెక్యురిటి ఏజెన్సీ దానికి నెలకు లక్షల రూపాయలు ఖర్చు, అధికారులకు ఇచ్చే జీతాలు అంత ప్రజల సొమ్ము వృధావుతుందని కావున భూములు పరిరక్షించకుంటే వాళ్ళందరిని ఉద్యోగాల నుండి తోసివేయ్యాలని హెచ్చరించారు. అధికారులు కబ్జాదారులకు ఇలాగే సహకరిస్తే ఇండ్లు లేని ప్రజలను కూడగొట్టి ఎర్రజండాలు పాతుతమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కోశాధికారి సదానంద్, సీపీఐ నాయకులు ఇమామ్,ప్రభాకర్,రాములు లు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page