సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం BC కులాల చేతివృత్తుల వారి అభివృద్ధికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి, వారికి తోడ్పాటు అందించే పథకాన్ని ప్రారంభిస్తూ… లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు అందజేశారు.
దేశంలోనే ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ… ప్రణాళిక బద్ధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా నిరంతరాయంగా సంక్షేమాన్ని అందించిన ప్రజాప్రభుత్వం మనదన్నారు.
గౌరవప్రదమైన ఆసరా పెన్షన్ లతో లబ్ధిదారులు గౌరవ ప్రదంగా బ్రతుకుతున్నారన్నారు.
అనంతరం లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి / షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ… ప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.