SAKSHITHA NEWS

Kalvakurti Govt Hospital Negligence of Govt Doctors with Nurses

కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం నర్సులతో కాన్పు*


సాక్షిత ప్రతినిధి.* కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ ప్రభుత్వ డాక్టర్ల కు కల్వకుర్తి పట్టణంలోనే ప్రైవేట్ హాస్పిటల్ లో ఉండడంతోనే మూడోసారి, కల్వకుర్తి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నరకం అనుభవించి బలైన బాలింత. నరకాన్ని తలపిస్తున్న కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్


నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ అంటేనే జంకుతున్న జనం ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మూడవసారి బలి అయిన బాలింత, వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కేశ మోని ఝాన్సీ (24) సోమవారం ఉదయం డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. దీంతో వైద్యులు స్కానింగ్ చేయించుకోమని చెప్పడంతో ఝాన్సీ భర్త యుగేందర్ గౌడ్ స్కానింగ్ చేయించి రిపోర్ట్ వైద్యులకు చూపించాడు.

రిపోర్ట్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన కల్వకుర్తి ప్రభుత్వ డాక్టర్లు. సాయంకాలం ఝాన్సీ కి పురిటి నొప్పులు అధికం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సుల ద్వారా డెలివరీ చేయించడంతో ఝాన్సీ చనిపోవడం జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

దీనికి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నర్సులు డెలివరీ చేయడంతో తన భార్య ఝాన్సీకి అధిక రక్తస్రావం కావడం ద్వారానే ఝాన్సీ మృతి చెందిందని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు బంధువులు నాయకులతో ధర్నాకు దిగారు. ఝాన్సీ మృతి చెందిన తర్వాత రెండు. మూడు. గంటలు అయినా చనిపోయిన సమాచారాన్ని ప్రభుత్వ డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని ఝాన్సీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ పాపం ఎవరిది ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని జిల్లా అధికారులదా ? కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ లో ప్రభుత్వ డాక్టర్లదా? ఇంత జరుగుతున్న కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలపై నోరు మేల్కొని జిల్లా స్థాయి అధికారులదా?. ప్రజాసేవయే తన లక్ష్యంగా ప్రజలే తన ప్రాణంగా ప్రజా సేవ చేస్తున్న ప్రజా ప్రతినిధులదా? ఇదంతా తెలిసిన ప్రభుత్వ హాస్పిటల్ ను నిర్లక్ష్యంగా వదిలేసిన అధికారులదా?,

ఇప్పటికైనా సిగ్గు పడండి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల్లారా ఇప్పుడు చనిపోయిన ప్లేస్ లో మీరు. మీ కుటుంబ సభ్యులు ఉంటే మీ ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందా? ఎన్ని రోజులు కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్తే చాలు యమలోకానికి పంపిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు,

దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు కల్వకుర్తి పట్టణంలోనే ప్రైవేట్ హాస్పిటల్ ఉండడం 9:45పీఎం. రాత్రి దాటితే చాలు డాక్టర్లు ఉండకపోవడం. ఏదైనా డెలివరీ కేసు వస్తే డాక్టర్లు రాకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఫోన్లో నర్సులకు ఆజ్ఞాపించడం నర్సులు డెలివరీ చేయడంతో ఇప్పటికే ముగ్గురు బాలింతల పోవడం జరిగింది. ప్రభుత్వ డాక్టర్ల తీరు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

వీరికి సపోర్ట్ చేసే రాజకీయ నాయకుల్లారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరాలు మీ కళ్ళకు కనపడతాయి.ఇలా జరగకుండా కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటలను కాపాడే బాధ్యత ప్రతి రాజకీయ నాయకుల మీద ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్లో తమ సొంత స్వలాభాల కోసం తమ ప్రైవేట్ హాస్పిటల్ ల కోసం కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో నిర్లక్ష్యం వహిస్తు,కల్వకుర్తి నియోజకవర్గం ప్రజల ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లు దృష్టిమొత్తంసంపాదించుకోవడానికి ఆశపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషంట్ల ప్రాణాలను గాలిలో కలిసేలాగా చేస్తున్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి ఘటనపై విచారణ జరిపి డాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ నాగర్ కర్నూల్ లో విధులు నిర్వహించాలి. కానీ ఇలాంటి ఆర్డర్ కాపీ లేకుండా తమ సొంత హాస్పిటల్ కల్వకుర్తి లోనే ఉండడంతో వెళ్లకుండా కల్వకుర్తి పట్టణంలోని నిధులు నిర్వహిస్తున్నారని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే సూపరిండెంట్.

కనుసైగలో ఇదంతా జరుగుతుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇకనైనా గుర్తించి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడి నిధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ డాక్టర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కల్వకుర్తి ప్రజలను కోరుతున్నారు. ఝాన్సీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కల్వకుర్తి ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.


SAKSHITHA NEWS