కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల చూపు ఉప్పల వెంకటేష్ వైపు

Spread the love

Kalvakurti Constituency’s eyes are on Uppala Venkatesh

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల చూపు ఉప్పల వెంకటేష్ వైపు.

సాక్షిత ప్రతినిధి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్న కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్*ప్రజాసేవ లో ఉన్న ఆనందం ఎందులో లేదు ప్రజాసేవకై నా జీవితం అంకితం జడ్పిటిసి ఉప్పల వెంకటేష్.


రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జడ్పిటిసి సభ్యుడు, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశు త్వరలో జరగబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని అన్నారు. ప్రజాసేవ చేయడంలో ముందు వరుసలో ఉండే మొదటి వ్యక్తి కల్వకుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజలను ఆదుకొని ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుస్తుండటంతో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కరోనా సమయంలో ఒక లక్షకు పైగా సానిటైజర్లు 25 వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి. నేనున్నానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ14500 కరోనా కిట్లు స్వయంగా ఇంటింటికి వెళ్లి కరోనా కిట్ల పంపిణీ. తనను నమ్మి వచ్చిన ప్రజలకు ఏలాంటి అవసరమైన తమ వంతు సహాయం చేసే వ్యక్తి. నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలకు, ఇల్లు లేని వారికి సుమారు 1000 కి పైగా ఇండ్ల నిర్మాణం ఇల్లు నిర్మించి ఇస్తూ, పేద ప్రజలు వైద్యం అందక ఎంతోమంది వైద్యానికి దూరం అవుతుండటం తో తను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 25 లక్షల రూపాయలతో నిరుపేద ప్రజల కోసం అంబులెన్స్ ని ఇప్పించాడు.

ఉప్పల వెంకటేష్. తల్లిదండ్రులు చనిపోయిన, పేద విద్యార్థిని విద్యార్థులకు పై చదువులు చదువుకోవడానికి తన ఉప్పల ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ పై చదువులు చదివేల ప్రోత్సహిస్తున్నాడు. ప్రమాదాలు జరిగి గాయాల బారిన పడిన కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాడు.

ఇలానే కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తలకొండపల్లి జడ్పిటిసి సభ్యులుగా ఘనవిజయం సాధించాడు ఉప్పల వెంకటేష్. తన మండలంలోని ఏ సమస్య ఉన్న క్షణాల్లో తీర్చేస్తున్నాడు. జెడ్పి సమావేశంలో తన మండల పనుల గురించి, ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ అధికారులకు, అధికార పార్టీ వారికి వణుకు పుట్టిస్తున్నాడు. ఉప్పల వెంకటేష్ సేవలు ఇలాగే కొనసాగితే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తుండటంతో తట్టుకునే నాయకుడే లేకుండా పోతాడేమో ఉన్నది

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రశ్న. ఉప్పల్ ట్రస్ట్ ద్వారా సేవలను కల్వకుర్తి నియోజకవర్గ లో మొత్తం విస్తరిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నాడు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నాడు ఉప్పల వెంకటేష్.

Related Posts

You cannot copy content of this page