
కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన “శుభానంద దేవి ముక్తేశ్వర స్వామి” దేవాలయ కమిటీ సభ్యులు…
131- బాపునగర్ శుభానందా దేవి ముక్తేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి దేవాలయ నిర్మాణ పనుల దశను ఎమ్మెల్యే కి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… శుభానంద దేవి ముక్తేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, ఆలయ కమిటీ సభ్యులు దేవాలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా పనులు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సుబ్బారావు, కార్యదర్శి దయానంద్, సలహాదారులు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు శ్రీనివాస్, దుర్గాప్రసాద్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app