SAKSHITHA NEWS

శంకర్పల్లి: మార్చ్ 31 🙁 సాక్షిత న్యూస్) ఆదివారం నాడు శంకర్పల్లి మున్సిపల్ లో గల మూడవ వార్డులో మహిళలతో పరిచయ వేదికలో మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమరత్ గారు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మూడో వార్డులో గల మహిళలతో జ్యోతి భీమ్ భరత్ ఇష్టా గోస్ట్ గా మాట్లాడారు. వాళ్ల యొక్క కష్టసుఖాలు అన్నీ తెలుసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ చేపట్టినటువంటి ఆరోగ్యారెంటీల పథకం 100 రోజులలోనే దాదాపుగా నాలుగు పథకాలు నెరవేర్చిందని తెలిపారు. అదేవిధంగా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నదని తెలిపారు. మహిళలు ఇకపై ఎలాంటి దిగులు లేకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు దాదాపు మహిళలకు కేటాయించిందని అని అన్నారు. కావున ఇకపై మహిళల కష్టాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు అన్నయ్యగా వ్యవహరించి కష్టాలు తీరుస్తాడని ఆమె అన్నారు. ఈ పరిచర్య వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పమ్మ, మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షురాలు రమ్య రెడ్డి, సుధ గాని స్వర్ణలత, శారద, ప్రశాంత్, శ్రీకాంత్, సుదగాని ప్రేమ్, మరియు మూడో వార్డుకు సంబంధించిన 50 మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 31 at 8.22.25 PM

SAKSHITHA NEWS