
జీవన్ రెడ్డి ని పరామర్శించిన బాల్క సుమన్, శంభీపూర్ రాజు…
సాక్షిత,హైదరాబాద్,:- ఇటీవల హత్యా ప్రయత్నానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డిని ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు మంగళవారం పరామర్శించారు.ఈ ఆపద సమయంలో ధైర్యంగా ఉండాలని వారు కోరారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావు లేదని, దీనిపై ప్రభుత్వ చర్యలు తీవ్రంగా వుంటాయని వారు హెచ్చరించారు.
