స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Spread the love

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్ లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభి0చారు.
సాక్షిత : కొద్దిసేపు పిల్లల తో కలిసి గాంధీ సినిమాను చూశారు

ఈ సందర్భంగా పిల్లలతో కొద్దిసేపు మంత్రి మాట్లాడారు

పిల్లలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని చూసి కేరింతలు కొట్టారు

వారికి అభివాదం చేస్తూ మంత్రి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు

*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ మన జాతి పిత

ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు

గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శం

పిల్లలు ఆయన జీవితాన్ని చదివి, ఇలా సినిమా రూపంలో చూసి నేర్చుకోవాలి

ఆయన చూపిన దారిలోనే సీఎం కెసిఆర్ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారు

మన గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు

పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు చాలా గొప్పవి

నాకు ఈ అద్భుత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా అవకాశం రావడం, నాకు గర్వకారణం

సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు

ప్రజలు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించాలి

మన స్వతంత్ర, ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పది

అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, cm కెసిఆర్ నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గొనాలి అని పిలుపునిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓ, మున్సిపాలిటీ లలో కౌన్సిలర్లు, గ్రామాలలో పంచాయతీ సెక్రటరీ లు, ఏ.ఎన్. ఎమ్., ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page