హాకీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జడ్పిటిసి

Spread the love

హాకీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జడ్పిటిసి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరాన్ని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణములో చిట్యాల జెడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్ ప్రారంభించారు. ఈ ఉచిత హాకీ శిక్షణ కార్యక్రమం 1.5.2023 నుండి31.5.2023 వరకు నిర్వహించనున్నారు. జెడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదయ్య గౌడ్ మాట్లాడుతూ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుంది ఈ శిక్షణ శిబిరాలని విద్యార్థులు క్రీడాకారులు వినియోగించాలని క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని అంతేకాకుండా క్రీడల వల్ల భవిష్యత్తులో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉయ్యాల నాగరాజు గౌడ్ ,శిక్షణ కోచ్ గంగపురం రాము, వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పరమేష్ సాగర్ల లింగస్వామి మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page