ప్రకృతి ఒడిలో వెలసిన జంగమయ్య క్షేత్రం – నైనా గుళ్ళు

Spread the love

Jangamayya Kshetra in the lap of nature – Naina Gullu

ప్రకృతి ఒడిలో వెలసిన జంగమయ్య క్షేత్రం – నైనా గుళ్ళు

నైనా గుళ్ల అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తా

ఆలయాన్ని దర్శించుకోవడం నా అదృష్టం

రహాదారి నిర్మాణానికి ప్రయత్నం చేస్తాం

జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

సాక్షిత న్యూస్, మంథని ప్రతినిధి:

పురాతణమైన నైనా గుళ్ల అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ భరోసా ఇచ్చారు.

మహా శివరాత్రి సందర్బంగా మంథని నియోజకవర్గం మల్హర్‌ మండలం కొయ్యూర్‌ అటవీ ప్రాంతంలోని నైనా గుళ్ళలో జరుగుతున్న శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
అటవీ ప్రాంతంలోని పురాతణమైన ఆలయాన్ని సందర్శించడం అదృష్టంగా బావిస్తున్నానని అన్నారు. గత మూడు, నాలుగేళ్లుగా ఆలయం ప్రాశస్త్యంలోకి వచ్చిందని, ఆలయ అభివృద్దికి కమిటి సభ్యులు కోరినట్లుగా తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్లాట్‌ఫాం, మెట్లు, మండపం తదితర అభివృధ్ది పనులు దాతల సహకారంతో నిర్మాణం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ యువ నాయకుడు జక్కు రాకేష్, పలువురు స్థానిక బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page