గిరిజన విద్యార్థి చదువులకు అండగా జంగయ్య యాదవ్.

Spread the love

Jangaiah Yadav supports the studies of tribal students.

గిరిజన విద్యార్థి చదువులకు అండగా జంగయ్య యాదవ్.
సాక్షిత ప్రతినిధి.


వెల్దండ మండల పరిధిలోని ఈదమ్మ బండ తండాకు లక్పతి నాయక్ ఎంబిబిఎస్ విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ జియాగూడ కామెలా యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అండగా నిలిచారు.

లక్పతి నాయక్ చదువుల కోసం రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం లక్పతి నాయక్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

గిరిజన తండాలో పుట్టి వైద్య విద్య కు అర్హత సాధించడం అభినందనీయం అన్నారు. ప్రతి నాయక్ ఉన్నత చదువులకు తన వంతుగా సహకారం ఎల్లవేళలా ఉంటుందని జంగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లంపల్లి ఉపసర్పంచ్ రాజు నాయక్ , రమేష్ యాదవ్ , జంగయ్య యాదవ్ , రవీందర్ యాదవ్, నరేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page