470 కేజీల వెండితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తరువు

Spread the love

470 కేజీల వెండితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తరువు .. …వీడియో ఇదిగో!

సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు

నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కళాకృతి
మేకింగ్ వీడియో విడుదల చేసిన నాదెండ్ల మనోహర్

జనసేనాని పవన్ కల్యాణ్ సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు. వెండి గొలుసులు ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page